News November 27, 2025
SRCL: మహిళల ఓట్లపైనే అందరి ఆశలు..!

GP ఎన్నికల్లో గెలుపు కోసం CONG, BRS మహిళలపైనే ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 170772 మంది పురుషులు, 182559 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11787 అధికంగా ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, ఫ్రీ RTC ప్రయాణం వంటి పథకాల పేరిట CONG ఓట్లు అడగనుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని BRS చూస్తోంది.
Similar News
News December 3, 2025
‘టీ’ దోమతో జీడి మామిడి తోటల్లో కలిగే నష్టం

రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్న తరుణంలో జీడిమామిడి తోటల్లో టీ-దోమ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల పంట ఉత్పత్తిలో సుమారు 30-40% నష్టపోయే ప్రమాదం ఉంది. టీ దోమలు చెట్టు లేత కొమ్మలు, పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. పూత రెమ్మలను ఆశిస్తే పూత మాడి, చెట్టు కాలినట్లు కనిపిస్తుంది. కొత్త కొమ్మలు, రెమ్మలపై ఆశిస్తే చెట్టు అభివృద్ధి క్షీణిస్తుంది. గింజలను ఆశిస్తే గింజలు వడిలి, తొలిదశలోనే రాలిపోతాయి.
News December 3, 2025
ఇది ‘RU-KO’ షో

రాయ్‌పూర్ వేదికగా SAతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14) నిరాశపరిచారు. కానీ, రుతురాజ్ , కోహ్లీ మాత్రం ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రెగ్యూలర్‌గా మనం రోహిత్-కోహ్లీ(RO-KO) షో చూస్తూ ఉంటాం. ఇవాళ మాత్రం రుతురాజ్-కోహ్లీ(RU-KO) షో చూస్తున్నాం. 28 ఓవర్లకు భారత్ స్కోర్ 193-2.
News December 3, 2025
మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా విధులు నిర్వహించాలి: మస్రత్ ఖానం

మైక్రో అబ్జర్వర్లు తమ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం సూచించారు. బుధవారం నిర్మల్ కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఆమెతో పాటు కలెక్టర్ అభిలాష అభినవ్ ఉన్నారు.


