News December 23, 2025
SRCL: మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మహేష్ బి.గీతేతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ రవాణా, వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, యువత మత్తుకు బానిస కాకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News January 10, 2026
VZM: మాజీ సర్పంచ్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన MLA

గరివిడి మండలం కోడూరు మాజీ సర్పంచ్ అడప సూర్యనారాయణ మృతిపై అనుమానలు ఉన్నాయని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. కుట్ర కోణం ఏమైనా ఉంటే దర్యాప్తు చేయాలని చీపురుపల్లి పోలీస్ అధికారులకి ఎమ్మెల్యే సూచించారు. రెండు రోజులు క్రితం అదృశ్యమైన సూర్యనారాయణ శుక్రవారం గ్రామ పొలిమేరలోని నీటి కుంటలో శవమై తేలిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులని ఓదార్చి దైర్యం చెప్పారు.
News January 10, 2026
సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీ

సంగారెడ్డి జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ అయ్యారు. వీరిలో నలుగురు తహశీల్దార్లతోపాటు ఆరుగురు డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు. పలువురు అధికారులను మండలాలు, కలెక్టరేట్ కార్యాలయానికి కేటాయించగా మరికొందరిని ఆర్డీవో కార్యాలయాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు.
News January 10, 2026
చైల్డ్ పోర్న్ బ్రౌజింగ్.. 24 మంది అరెస్ట్

TGలో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నవారిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో <<18800907>>అరెస్ట్<<>> చేసి కౌన్సెలింగ్ ఇస్తోంది. సైబర్ టిప్ లైన్ ద్వారా అందిన ఫిర్యాదులతో HYDలో 15, WGLలో ముగ్గురు, NZBలో ఇద్దరు సహా మొత్తం 25మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖలో జూ.అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కూడా ఉన్నాడు. చైల్డ్ పోర్న్ చూసేవారిని ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్&అబ్యూస్ మెటీరియల్ గుర్తిస్తోంది.


