News May 21, 2024

SRCL: వారికి తెలియకుండానే అకౌంట్‌లో డబ్బులు కొట్టేశారు!

image

వారికి తెలియకుండానే వారి ఖాతాలోని డబ్బులు మాయం చేశారు. ఈ ఘటన గంభీరావుపేటలో జరిగింది. గంభీరావుపేటకు చెందిన కోటయ్యగారి రాజేందర్‌రెడ్డి ఖాతా నుంచి ఈ నెల 15న రూ.45,000, 16 న దండ నరేశ్ ఖాతా నుంచి రూ.44,990, 17న లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఖాతా నుంచి రూ.50 వేలు, 18న కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85లక్షలు కట్ అయ్యాయి. తమకు తెలియకుండా డబ్బులు పోయాయని బ్యాంకును సంప్రదించగా.. సైబర్ నేరగాళ్ల పనేనని తెలింది.

Similar News

News December 26, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నేటి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ. 2,65,369 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,60, 265, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 74,515 , అన్నదానం రూ.30,589 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News December 26, 2024

దేనికి బేష్? దేనికి శభాష్?: బండి సంజయ్

image

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించిందని రాహుల్ గాంధీ ‘ప్రజాపాలన బేష్’ అంటూ వ్యాఖ్యానించారో చెప్పాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదన్నారు. గ్యారెంటీలను అమలు చేయని ప్రభుత్వానికి ‘దేనికి బేష్? దేనికి శభాష్?’ అని ప్రశ్నించారు.

News December 26, 2024

ఎర్రోళ్ల అక్రమ అరెస్టు దుర్మార్గమైన చర్య: కేటీఆర్

image

బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని సిరిసిల్ల MLA, మాజీ మంత్రి KTR అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.