News March 5, 2026

SRCL: 99 రోజుల ‘ప్రజా పాలన’ను విజయవంతం చేయాలి

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు చేపట్టనున్న “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 14, 2026

ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

image

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

News April 14, 2026

కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

image

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.

News April 14, 2026

శుభవార్త.. పోలీసులకు ప్రత్యేక సెలవులు

image

AP: నిత్యం విధుల్లో ఉండే పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బర్త్ డే, మ్యారేజ్ డే సందర్భంగా వారు కుటుంబంతో గడిపేందుకు వీలుగా స్పెషల్ లీవ్స్ కల్పిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులిచ్చారు. అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు మంజూరు చేయాలని జిల్లాల ఎస్పీలు, అన్ని పోలీస్ విభాగాల అధిపతులను ఆదేశించారు. దీంతో వేలాది పోలీసులకు ఊరట కలగనుంది.