News November 19, 2025
SRCL: “CESS”లో విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్మెంట్ సోదాలు

కో- ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ LTD SRCL ఆఫీస్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, సెస్ కార్యకలాపాలకు సంబంధించి రికార్డులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. CESS కార్యాలయ సిబ్బంది నుంచి పలు రికార్డులు, FILES స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారులకు REPORT పంపనున్నారు.
Similar News
News April 10, 2026
NGKL: ఉపాధి హామీలో ‘ఫేస్ అథెంటికేషన్’.. ఉత్తమ సిబ్బందికి పురస్కారాలు

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ‘ఫేస్ అథెంటికేషన్’ హాజరు నమోదులో ప్రతిభ చూపిన ఫీల్డ్ అసిస్టెంట్లకు బహుమతులు అందజేయనున్నారు. జిల్లాలో బుద్ధసముద్రం ఎఫ్.ఏ ప్రథమ, ఊరుకొండ ఎఫ్.ఏ ద్వితీయ స్థానంలో నిలిచారు. పారదర్శకంగా హాజరు నమోదు చేస్తున్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం జిల్లాలోని 460 పంచాయతీల్లో ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
News April 10, 2026
ఆ బాధతో రోజూ ఫుల్ బాటిల్ తాగేవాడిని: ఆమిర్

తనను ఒంటరిగా వదిలి మొదటి భార్య రీనా దత్తా ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు తీవ్రంగా కుంగిపోయానని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఎమోషన్లను అదుపు చేసుకోలేక ఏడాదికిపైగా రోజూ ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు తనకు లిక్కర్ అలవాటు లేదన్నారు. రీనాతో 2002లో, కిరణ్ రావుతో 2021లో ఆమిర్ డివోర్స్ తీసుకొన్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్‌లో ఉన్నారు.
News April 10, 2026
ASF: వివాహిత సూసైడ్.. కారణం ఇదే..!

కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో తానియా విశ్వాస్(22) అనే గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె, చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తగారింట్లో చున్నీతో ఉరి వేసుకుంది. మృతురాలి తమ్ముడు వాసుదేవ్ సర్కార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


