News November 19, 2025

SRCL: “CESS”లో విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్మెంట్ సోదాలు

image

కో- ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ LTD SRCL ఆఫీస్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, సెస్ కార్యకలాపాలకు సంబంధించి రికార్డులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. CESS కార్యాలయ సిబ్బంది నుంచి పలు రికార్డులు, FILES స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారులకు REPORT పంపనున్నారు.

Similar News

News March 29, 2026

పిఠాపురం: గెద్దనాపల్లి యువకుడిపై పోక్సో కేసు

image

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఏర్పడిన పరిచయం ఓ బాలిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. పిఠాపురానికి చెందిన ఓ బాలికను ప్రేమపేరుతో నమ్మించి, గర్భవతిని చేసిన కిర్లంపూడి(M) గెద్దనాపల్లికి చెందిన సూర్యచందు(19)పై పిఠాపురం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చెన్నైలో మెటీరియల్ కట్టర్‌గా పనిచేసే నిందితుడు, తరచూ పిఠాపురం వచ్చి బాలికను కలిసేవాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

News March 29, 2026

వచ్చే నెల 7 లోగా విద్యార్థులు పాఠశాలలో చేరండి: లోక రాజు

image

2026-27 విద్యా సంవత్సరానికి విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్-12(1)సీ ప్రకారం ఒకటో తరగతి అడ్మిషన్లకు మొదటి విడత లాటరీ ద్వారా 2,734 మంది ఎంపికయ్యారని కర్నూలు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ లోక రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ లోపు ఆయా పాఠశాలలో ఉచిత అడ్మిషన్లు పొందాలన్నారు. తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే 90001 04836ను సంప్రదించవచ్చు అన్నారు.

News March 29, 2026

SRH ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్‌కు గాయం

image

SRH బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్(ఇంగ్లండ్) గాయపడినట్లు హెడ్ కోచ్ వెటోరీ వెల్లడించారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి ఆయన చేతికి బలంగా తాకడంతో వాపు వచ్చిందన్నారు. RCBతో మ్యాచులో ఆడటానికి ట్రై చేసినప్పటికీ సాధ్యం కాలేదని చెప్పారు. ప్రస్తుతం బ్రైడన్ కోలుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 2న KKRతో మ్యాచుకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.