News March 21, 2025
SRCL: CM దిష్టిబొమ్మ దహనం.. 15 మందిపై కేసు

చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈనెల 16న చందుర్తి మండల కేంద్రంలో అనుమతి లేకుండా రాస్తారోకో చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎంపీపీ పెంటయ్య, మాజీ మార్కెట్ ఛైర్మన్ డప్పుల అశోక్ సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Similar News
News December 5, 2025
MBNR: ఎన్నికల వేళ… జోరందుకున్న దావత్లు!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోద కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పల్లెల్లో నేతలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.
News December 5, 2025
ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్ఛార్జ్ PO సమావేశం

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 5, 2025
కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోండి: ఎంపీ

జిల్లాలో కొబ్బరి రైతులను ఆదుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ శుక్రవారం పార్లమెంటులో కోరారు. జిల్లాలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కొబ్బరి పంట వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు జీవనోపాధిని నిలబెట్టే సాంస్కృతిక, ఆర్థిక ఆధారాలని ఎంపీ తెలిపారు.


