News March 21, 2025

SRCL: CM దిష్టిబొమ్మ దహనం.. 15 మందిపై కేసు

image

చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈనెల 16న చందుర్తి మండల కేంద్రంలో అనుమతి లేకుండా రాస్తారోకో చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎంపీపీ పెంటయ్య, మాజీ మార్కెట్ ఛైర్మన్‌ డప్పుల అశోక్ సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Similar News

News December 22, 2025

KNR: JAN 31 వరకు ఉచితంగా మందులు

image

కరీంనగర్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం సోమవారం కొత్తపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అధికారి డాక్టర్ ఎన్. లింగారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, జీవాలకు మందులు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 22 నుంచి జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

News December 22, 2025

ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం: మంత్రి

image

TG: భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థకు సంబంధించి జ‌న‌వ‌రిలో ఆధునీక‌రించిన డిజిటల్ వ్య‌వ‌స్థను తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రెవెన్యూ, స్టాంప్స్&రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్‌ కిందకి తీసుకొచ్చి “భూభార‌తి”తో లింక్ చేస్తాం. ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్‌తో లాగిన్ అవగానే ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం వస్తుంది. స‌ర్వే నంబ‌ర్లకు మ్యాప్‌ను రూపొందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News December 22, 2025

‘NGKL జిల్లాలో ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం కావాలి’

image

జిల్లాలో ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ అమలుపై జరుగుతున్న ముందస్తు ప్రణాళిక పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓటర్స్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.