News March 27, 2025

SRCL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం KNR, PDPL, JGTL, SRCL డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో దిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News December 5, 2025

సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్‌

image

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.

News December 5, 2025

సీఎం స్టాలిన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

image

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్‌తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.

News December 5, 2025

SVU: పరీక్ష ఫలితాలు విడుదల.!

image

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc 3, 4 M.A హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్ రైట్స్ ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం (SVU DDE) ఆధ్వర్యంలో B.LI.Sc పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.