News March 27, 2025

SRCL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం KNR, PDPL, JGTL, SRCL డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో దిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News December 22, 2025

గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్

image

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహశీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని రెండు.నియోజకవర్గాల పురోగతిని గణాంకాల ఆధారంగా సమీక్షించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

News December 22, 2025

అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: SP

image

PGRS అర్జీల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని SP బిందుమాధవ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వయంగా 27 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, గడువులోగా పరిష్కరించాలని సూచించారు. చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

News December 22, 2025

వక్ఫ్ భూముల్లో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో వక్ఫ్ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటుకు వక్ఫ్ బోర్డు, సర్వే, రెవిన్యూ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వక్ఫ్ భూములను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సర్వే జరిగేలా చూడాలన్నారు.