News March 15, 2025

SRD: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..

Similar News

News April 20, 2025

వచ్చే సంక్రాంతికి అఖండ-2?

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25కి ప్లాన్ చేయగా ఆలోపు సినిమా షూటింగ్, VFX వర్క్స్ పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్. కాగా బాలయ్య- బోయపాటి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలను సినీ వర్గాలు <<16051406>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.

News April 20, 2025

NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

image

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు

News April 20, 2025

జూరాల నుంచి నీటిని విడుదల చేయలేం: వనపర్తి కలెక్టర్

image

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టు గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయినందున, తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని అన్నారు. కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి జూరాలకు కొంత నీటిని విడుదల చేసే విధంగా చూడాలని మంత్రిని కలెక్టర్ కోరారు.

error: Content is protected !!