News April 5, 2025

SRD: ఆరేళ్ల లోపు పిల్లలకు కంటి పరీక్షలు: DMHO

image

జిల్లాలో ఈనెల 7 నుంచి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శుక్రవారంలో తెలిపారు. వైద్య సిబ్బంది నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి కంటి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.

Similar News

News April 6, 2025

భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

image

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

News April 6, 2025

నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

image

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ అడుగులు పడ్డాయి. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

News April 6, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ∆} ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

error: Content is protected !!