News April 6, 2024

SRD: ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఉత్పత్తుల నమూనాల సేకరణ

image

చందాపూర్‌‌లోని ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఘటనా స్థలాన్ని నిన్న ఫోరెన్సిక్‌ లేబొరేటరీ AD వెంకట్‌రాజ్‌ పరిశీలించి ఉత్పత్తుల నమూనాలు సేకరించారు. సంగారెడ్డి MNR ఆస్పత్రిలో చందాపూర్‌కు చెందిన అశోక్‌సింగ్‌ చేతికి శస్త్రచికిత్స చేయగా మిగిలిన వారు ఇంటికెళ్లారని, సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో 1, HYDలో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో 6 మంది మృతిచెందగా 16 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

Similar News

News January 14, 2025

మెదక్: జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి

image

జిల్లా ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రైతు రుణమాఫీ, సకాలంలో ధాన్యం కొనుగోలు, సన్నాలకు రూ.500 బోనస్ తదితర కార్యక్రమాల్లో ప్రజల్లో హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి రైతులు, వ్యవసాయ కూలీలకు అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, పేద ప్రజలకు ఉద్దేశించి రేషన్ కార్డుల జారీ చేయనున్నామని అన్నారు.

News January 14, 2025

MDK: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

మెదక్: సంతోషంగా పండగను జరుపుకోవాలి: ఎస్పీ

image

మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకున్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలాన్నారు.