News January 29, 2025
SRD: ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు

సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆర్ఎం ప్రభులత మాట్లాడుతూ.. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలన్నారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న సయ్యద్‌కు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరుణ, అన్ని డీపోల డీఎంలు పాల్గొన్నారు.
Similar News
News October 29, 2025
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్స్ మార్చాలి. మైల్డ్, సువాసన లేని సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.
News October 29, 2025
HYD: తెలుగు వర్సిటీ.. నేడు సాహితీ పురస్కారాల ప్రదానం

బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈనెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.
News October 29, 2025
KNR: అమ్మాయిలపై లైంగిక దాడి చేసింది ‘వీడే’..!

గంగాధర ZPHS ఘటనలో అటెండర్ యాకుబ్‌ను పోలీసులు రేకుర్తి చౌరస్తా వద్ద నిన్న అరెస్ట్ చేశారు. అయితే విద్యార్థినులపై లైంగికదాడి జరిగిందని <<18128528>>స్వయంగా CP<<>>నే చెప్పడం ఆడపిల్లల పేరెంట్స్‌ను ఆందోళన కలిగిస్తోంది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా.. చదువుకునేందుకు అన్ని వసతులున్నా ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే యాకుబ్ లాంటి కామాంధులుంటే పేదింటి ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.


