News January 3, 2025

SRD: ఈ నెల 22 వరకు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించండి

image

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పదవ తరగతి ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, ఇంటర్మీడియట్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని పేర్కొన్నారు. రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 29 వరకు, రూ. 50 అపరాద రుసుంతో ఫిబ్రవరి 5వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.

Similar News

News December 15, 2025

మెదక్: నాడు గెలిచి.. నేడు ఓడిన దంపతులు

image

మెదక్ మండలం మాచవరం గ్రామపంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి ఆకర్షించే విషయం తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన దంపతులు ఈసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచిగా సంధ్యారాణి, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ చౌదరి గెలుపొందారు. ఈసారి సర్పంచ్ పదవికి శ్రీనివాస్ చౌదరి, వార్డు సభ్యులు పదవికి సంధ్యా రాణి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక్కడ సాంబశివరావు గెలుపొందారు.

News December 15, 2025

MDK: గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

image

ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో గత రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్‌ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News December 15, 2025

మెదక్: 12 చోట్ల ఉప సర్పంచ్ ఎన్నికలు

image

మెదక్ జిల్లాలో నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనిచోట ఈరోజు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 142 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా 12 చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు కొన్ని అనివార్య కారణాలవల్ల జరగలేదని డీపీఓ యాదయ్య తెలిపారు. ఈరోజు వార్డు సభ్యులకు నోటీసు జారీ చేసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు.