News January 3, 2025

SRD: ఈ నెల 22 వరకు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించండి

image

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పదవ తరగతి ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, ఇంటర్మీడియట్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని పేర్కొన్నారు. రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 29 వరకు, రూ. 50 అపరాద రుసుంతో ఫిబ్రవరి 5వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.

Similar News

News January 25, 2025

రేపు మాంసం దుకాణాలు బంద్: కమిషనర్

image

రేపు రామాయంపేట మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు జరపొద్దని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు మూసివేయాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్‌ ఉండనున్నాయి.

News January 25, 2025

రామాయంపేట: గిరిజన యువకుడికి 2 ప్రభుత్వ ఉద్యోగాలు

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన గిరిజన విద్యార్థి జవహర్ లాల్ నాయక్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల ప్రకటించిన సెంట్రల్ వాటర్ కమిషన్‌లో జూనియర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ కాగా, శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించిన నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. తమ తండాకు చెందిన యువకుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.

News January 25, 2025

MDK: తగ్గిన ఎయిర్టెల్ సిగ్నల్ 

image

ఎయిర్టెల్ సిమ్ము వినియోగదారులకు గత కొన్ని రోజుల నుంచి సిగ్నల్ సరిగా అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్టెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఒక సైట్ ఓపెన్ కావడానికి 1 నిమిషం వరకు పడుతోందని యువకులు అంటున్నారు. airtel సిబ్బంది స్పందించలన్నారు.