News February 27, 2026
SRD: ఎలుకల మందు తాగి పారిపోయాడు!

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న అనిల్ (28) అనే ఆటో డ్రైవర్ పటాన్‌చెరు జేపీ కాలనీలోని తన నివాసంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెట్టింగ్ నష్టంతో మద్యం తాగి భార్యతో గొడవపడిన అతను, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు వచ్చేలోపే పారిపోయిన అనిల్‌ను, అరగంట తర్వాత అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 12, 2026
ATP: రోడ్డు ప్రమాదం.. రుద్రంపల్లి రైతు మృతి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లికి చెందిన రైతు కురుబ మహాలింగ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి తన పొలంలో పండిన చిలగడదుంపలను బొలెరో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, కర్నూలు సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహాలింగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తూ రైతు విగతజీవిగా మారడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
News April 12, 2026
KKRకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి పతిరణ

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవని KKRకు శుభవార్త. స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం నుంచి కోలుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి NOC కూడా సాధించారు. దీంతో అతి త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. ఆయన రాకతో KKR బౌలింగ్ విభాగం బలపడనుంది. కాగా కోల్‌కతా 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.


