News February 12, 2026

SRD: ఓట్లు బ్యాలెట్ బాక్సులో.. అభ్యర్థుల్లో టెన్షన్

image

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వాతంత్ర అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అభ్యర్థుల జయాపజయాలు రేపు జరగనున్న కౌంటింగ్‌లో తేలనుంది.

Similar News

News March 13, 2026

ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

image

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT

News March 13, 2026

తిరుపతిలో 16న జాబ్ మేళా.. 650 జాబ్స్

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌ (MCC)లో 16వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 650 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 13, 2026

గ్యాస్ దెబ్బ.. పెరిగిన టిఫిన్ల ధరలు!

image

ఎల్పీజీ కొరత సాకుగా చూపి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు టిఫిన్ల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రతి ఐటమ్‌పై ప్లేట్‌కు రూ.10 పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పెంపు మాత్రమేనని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదని, ఇటీవల LPG ధర కూడా పెరగడంతో నిర్వహణ ఖర్చులు ఎక్కువైనట్లు పేర్కొంటున్నాయి. మరి మీ ఏరియాలోనూ టిఫిన్ల ధరలు పెరిగాయా? COMMENT