News March 1, 2025
SRD: కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్

ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం సంగారెడ్డి పట్టణంలో నెలవంక ఆకాశంలో దర్శనమిచ్చింది. ముస్లింలకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. పండగ సందర్భంగా దానధర్మాలు చేస్తారు. ఇప్పటికే జిల్లాకు చెందిన వారు పండుగ పనులు ప్రారంభించారు.
Similar News
News January 9, 2026
నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం: చంద్రబాబు

AP: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడూ మమ్మల్ని ఇలాగే విమర్శించారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
News January 9, 2026
ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

భారత్‌పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.
News January 9, 2026
పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుంది: MLA

మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని, ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో శుక్రవారం టీజీఐఐసీ కార్పొరేషన్ ద్వారా సుమారు రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.


