News March 9, 2025
SRD: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఝరాసంఘంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ బేబీ సింగ్ తెలిపారు. 1వ తరగతిలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, ఈనెల 21 వరకు https://kvsangathan.nic.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్‌లో 15, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
News November 3, 2025
వేగం వద్దు బ్రదర్.. DRIVE SAFE

వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించదు. ఈ సమయంలో అతివేగం అత్యంత ప్రమాదకరం. ‘కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు.. మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడమే ముఖ్యం’ అని వారు సూచిస్తున్నారు. డ్రైవర్లు నిర్ణీత వేగ పరిమితి పాటించాలని, సురక్షిత దూరాన్ని కొనసాగించాలని అవగాహన కల్పిస్తున్నారు.
News November 3, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్బ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ గేటు వద్ద ఆర్టీసి బస్సు ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారన్నారు.


