News February 1, 2025
SRD: గురుకుల ప్రవేశాలకు గడువు పొడిగింపు

ప్రభుత్వంలో వివిధ గురుకులాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఈనెల 6 వరకు గడువు పొడిగించినట్లు TGSWREIS అధికారులు శనివారం తెలిపారు. గురుకులాల్లో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 1 చివరి తేదీగా ఉండగా మరో 5 రోజులు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 8, 2025
ఒలింపిక్స్కు క్రికెట్ జట్ల ఎంపిక ఇలా..

LA-2028 ఒలింపిక్స్లో ఆడే క్రికెట్ జట్ల ఎంపికను ICC పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఖండాలవారీగా ర్యాంకింగ్లోని టాప్ జట్లు ఆడనున్నాయి. IND(ఆసియా), SA(ఆఫ్రికా), ENG(యూరప్), AUS(ఓషియానియా), ఆతిథ్య జట్టుగా USA/WI ఎంపికవుతాయి. ఆరవ జట్టుగా గ్లోబల్ క్వాలిఫయర్ ఎంపిక బాధ్యత అమెరికాపై ఉండనుంది. ఈ విధానం వల్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న జట్టుకూ అవకాశం దక్కకపోవచ్చు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
News November 8, 2025
ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ పెడుతున్నారా?

ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం సర్వసాధారణం. కానీ వీటిలో వేడి పదార్థాలు, నూనెలు, ఆమ్ల స్వభావం గల ఆహారాలను పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. ఆహారాన్ని నిల్వ చేయడానికి.. గాజు, స్టెయిన్లెస్ స్టీల్, సిలికాన్, బీస్వాక్స్, వెదురుతో చేసినవి వాడొచ్చు. అవన్నీ విషరహిత పదార్థాలతో తయారు చేయడం వల్ల.. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వాటిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 8, 2025
కృష్ణా: LLB & BA.LLB కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్లో 90- 92 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్ను రూపొందించామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్లో అకడమిక్ క్యాలెండర్ను చూడవచ్చు.


