News March 20, 2025
SRD: పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: ఎస్పీ

జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు ఐదుగురుకు మించి తిరగవద్దని చెప్పారు. పరీక్ష జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మూడో రోజు కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ మధుసూదన్ పర్యటన
News December 5, 2025
గచ్చిబౌలి శాంతిసరోవర్లో ‘సండే ఈవినింగ్ టాక్’

బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ క్యాంపస్లో ఆదివారం ‘సండే ఈవినింగ్ టాక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్మెంట్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
News December 5, 2025
మూడో విడత.. నిన్న ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 7 మండలాల్లో కలిపి సర్పంచ్కు 288, అటు వార్డులకు 1173 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో కలిపి ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు గాను 378, 1742 వార్డులకు గాను 1410 నామినేషన్లు వచ్చాయి.


