News April 24, 2025
SRD: ‘పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి’

విద్యారంగా సమస్యలపైన బుధవారం విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి తప్పనిసరి అని, పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహ రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 24, 2025
జిల్లా వ్యాప్తంగా 31 కేసులు

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలోని 31 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రజల అవసరాలకు అధిక వడ్డీలను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు
News April 24, 2025
పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయి: SP

పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందుతున్న కానిస్టేబుల్‌లకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీసు కానిస్టేబుల్‌లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. మొత్తం 28 మందికి పదోన్నతి రాగ అందులో ఆదిలాబాద్ జిల్లా వారు పదిమంది ఉండటం సంతోషకరమని ఎస్పీ అన్నారు.
News April 24, 2025
నాగల్ గిద్ద: భూభారతి చట్టంతో రైతులకు మేలు: కలెక్టర్

భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. నాగల్ గిద్దలో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో భూమికి సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.