News June 17, 2024

SRD: ఫేస్‌బుక్‌లో ప్రకటన.. లాభాలు చూపిస్తామని మోసం!

image

ఫేస్‌బుక్‌లో ప్రకటన ద్వారా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు చూపిస్తామంటూ ఆశ చూపి రూ.12.52 లక్షలు కాజేసిన ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పోచారంలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి ఫేస్‌బుక్ ప్రకటన చూసి ఓ వాట్సప్ గ్రూప్‌లో చేరింది. APR 12 నుంచి JUN 14 వరకు రూ.13.8 లక్షలు పెట్టుబడి పెట్టగా వాటిలో రూ.1.30 వెనక్కి తీసుకుంది. మిగతావి రాకపోవడంతో PSలో ఫిర్యాదు చేసింది.

Similar News

News November 21, 2025

మెదక్: డీఈవోగా విజయ బాధ్యతలు

image

మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఏ.విజయ శుక్రవారం బాధ్యతలు చేయట్టారు. ఏడీగా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. SCERT ప్రొఫెసర్ డి.రాధా కిషన్ ఇన్‌ఛార్జ్ డీఈఓ, డైట్ ప్రిన్సిపల్‌గా గత 22 నెలలుగా పనిచేసి ఈనెల 11 నుంచి సెలవుపై వెళ్లడంతో ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇచ్చారు.

News November 21, 2025

ఉమ్మడి జిల్లాను వణికిస్తోన్న చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ 9.9, ఝరాసంగం10.6, మెదక్ జిల్లా శివంంపేట11.2, పెద్దశంకరంపేట 12.0, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 11.6, కొండపాకలో 12.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 21, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.