News June 17, 2024
SRD: ఫేస్‌బుక్‌లో ప్రకటన.. లాభాలు చూపిస్తామని మోసం!

ఫేస్‌బుక్‌లో ప్రకటన ద్వారా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు చూపిస్తామంటూ ఆశ చూపి రూ.12.52 లక్షలు కాజేసిన ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పోచారంలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి ఫేస్‌బుక్ ప్రకటన చూసి ఓ వాట్సప్ గ్రూప్‌లో చేరింది. APR 12 నుంచి JUN 14 వరకు రూ.13.8 లక్షలు పెట్టుబడి పెట్టగా వాటిలో రూ.1.30 వెనక్కి తీసుకుంది. మిగతావి రాకపోవడంతో PSలో ఫిర్యాదు చేసింది.
Similar News
News July 11, 2025
మెదక్: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు బడ్జెట్ విడుదలైందని DEO రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాకు రూ.26,97,786 విడుదల చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.
News July 11, 2025
రాబోయే తరాల కోసం కృషి చేయాలి: డీఈవో

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈవో డాక్టర్ రాధా కిషన్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
News July 11, 2025
MDK: ‘చదువుకోసం సైకిల్ తొక్కుతాం’

చదువు కోసం సైకిల్ తొక్కుతామని మెదక్ మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అన్నారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తమ గ్రామానికి సుమారు 2 KM దూరంలో ఉన్న మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ప్రతిరోజూ సైకిల్ పై పాఠశాలకు వెళ్లివస్తుంటారు. ఆటోలో వెళ్లాలంటే డబ్బులు కావాలని, చదువు కోసం కష్టమైనా సైకిల్ పైనే వెళ్తామన్నారు.