News February 23, 2025

SRD: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో శిక్షణ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 23, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ➤ ఆదోనిలో ఘోరం.. బాలుడిపైకి దూసుకెళ్లిన లారీ ➤ మంత్రాలయం శ్రీ మఠంలో ఆకట్టుకున్న భరతనాట్యం ➤ ఎమ్మిగనూరు ఎస్ఎంఎల్ కాలేజీలో 25న జాబ్ మేళా ➤ జిల్లాలో చికెన్‌కు తగ్గిన డిమాండ్ ➤ రూ.1.15 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం ➤ జిల్లాలోని ఆలయాల్లో మొదలైన మహా శివరాత్రి సందడి

News February 23, 2025

నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

☞ శ్రీశైలానికి ఎంపీ శబరి పాదయాత్ర
☞ గడివేముల మండలంలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
☞ నెల్లూరు జిల్లాలో మంత్రి బీసీ పర్యటన
☞నంద్యాలలో ర్యాలీని జయప్రదం చేయండి: బొజ్జా
☞ చెంచు మహిళలకు కుట్టు మెషీన్లు పంపిణీ
☞ శ్రీశైలంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
☞ ప్రొద్దుటూరులో ట్రాక్టర్ బోల్తా.. ఆళ్లగడ్డ డ్రైవర్ మృతి
☞ ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు: కర్నూలు కలెక్టర్

News February 23, 2025

జిల్లాలో గ్రూప్‌-2 మెయిన్స్ ప్ర‌శాంతం : కలెక్టర్

image

ఎన్టీఆర్ జిలాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్షలు ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ లక్ష్మీశ ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ‌లోని 19 కేంద్రాల్లో 8,792 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయ‌గా.. ఉద‌యం జ‌రిగిన పేప‌ర్‌-1కు 83.89 శాతం (7,376), మ‌ధ్యాహ్నం పేప‌ర్‌-2కు 83.62 శాతం (7,352) మంది హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు.

error: Content is protected !!