News February 16, 2025
SRD: మ్యాట్రిమోని పేరుతో డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News March 14, 2025
సిద్దిపేట: WOW.. గ్రూప్స్‌లో సత్తా చాటిన బ్రదర్స్

బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతులకు చెందిన కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేష్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం వెంకటేష్ పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నాడో హరికృష్ణ గ్రూప్-2లో 184 ర్యాంక్ సాధించారు.
News March 14, 2025
NGKL: అత్తమామల సాకారంతో GOVT ఉద్యోగం.!

కోడేరు మండలానికి చెందిన ఫౌజియాకు జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాన్ని ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్త, మామ, భర్త సాకారంతో ఈ ఉద్యోగం సాధించానని, వారి సహకారం మరువలేనని తెలిపారు.
News March 14, 2025
SRD: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.