News April 11, 2025
SRD: రేపే స్క్రీనింగ్ టెస్ట్.. వెబ్ సైట్లో హాల్ టికెట్లు

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఇవ్వనున్న బ్యాంకింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ టీ.ప్రవీణ్ తెలిపారు. ఈనెల12 శనివారం రోజు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు.
Similar News
News December 19, 2025
ధన్వాడ: తండ్రి అడుగుజాడల్లో.. కుమారుడి విజయం

ధన్వాడ మండలంలోని మందిపల్లిలో తండ్రి వారసత్వాన్ని కుమారుడు సురేందర్ రెడ్డి కొనసాగిస్తున్నారు. గతంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి (1964-88) సుదీర్ఘకాలం సర్పంచ్‌గా సేవలందించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సురేందర్ రెడ్డి.. 1994లో ఉప సర్పంచ్‌గా, 2001లో సర్పంచ్‌గా గెలిచారు. తాజాగా 2025 ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా ఎన్నికై తమ కుటుంబానికి ఓటమి లేదని నిరూపించారు.
News December 19, 2025
నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.
News December 19, 2025
మరికల్: ఆ పల్లెకు సర్పంచ్‌లుగా నాడు తల్లి.. నేడు తనయుడు

మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో తల్లి వారసత్వాన్ని కుమారుడు నిలబెట్టుకున్నారు. 2019లో ఈ పంచాయతీ నూతనంగా ఏర్పడగా, తొలి సర్పంచ్‌గా కళావతమ్మ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఆమె తనయుడు విజయ్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థిపై 111 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తల్లి హయాంలో జరిగిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


