News April 5, 2025
SRD: అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్ క్రాంతి

సన్న బియ్యం పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Similar News
News April 5, 2025
పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
News April 5, 2025
జగిత్యాల వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను జగిత్యాల జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
News April 5, 2025
విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.