News March 15, 2025
SRD: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
Similar News
News March 15, 2025
NRPT: జిల్లాకు మంచి పేరు తేవాలి: డీఈవో

నారాయణపేట మండలం జాజాపూర్ మండల పరిషత్ పాఠశాలలో శనివారం డీఈవో గోవిందరాజు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తరగతుల శిక్షణకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. శిక్షణను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.
News March 15, 2025
ఆ బ్యాంకు డిపాజిటర్లు భయపడొద్దు: RBI

ఇండస్‌ఇండ్ బ్యాంకుపై వదంతులను RBI కొట్టిపారేసింది. ‘డిపాజిటర్లు వాటిని నమ్మొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. తగినంత మూలధనమూ ఉంది. ఇప్పటికే మా ఎక్స్‌టర్నల్ ఆడిట్ టీమ్‌తో కలిసి A/Cను బ్యాంకు సమగ్రంగా సమీక్షిస్తోంది’ అని తెలిపింది. బ్యాంకు డెరివేటివ్ పోర్టుఫోలియోలో Rs1580 CR అవకతవకలు జరగడం, మొత్తం నెట్‌వర్త్‌పై దాని ప్రభావం 2.35% ఉంటుందన్న వార్తలపై స్పందించింది.
News March 15, 2025
హిందీపై పవన్ కామెంట్స్.. జనసేన శతఘ్ని క్లారిటీ

గతంలో పవన్ హిందీని వ్యతిరేకించారని జరుగుతున్న ప్రచారంపై జనసేన శతఘ్ని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘పవన్ హిందీని మాత్రమే నేర్చుకోవాలనే నిబంధనను వ్యతిరేకించారు. త్రిభాషా విధానంలో హిందీని కచ్చితంగా అమలు చేయాలనే రూల్ లేదు. NEP-2020 ప్రకారం విద్యార్థులు మాతృభాషతో పాటు ఏదైనా భారతీయ భాష, విదేశీ భాష నేర్చుకునే సౌలభ్యం ఉంది. రాజకీయాల కోసం హిందీని రుద్దుతున్నారనే ప్రచారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.