News April 5, 2025
SRD: ఆరేళ్ల లోపు పిల్లలకు కంటి పరీక్షలు: DMHO

జిల్లాలో ఈనెల 7 నుంచి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శుక్రవారంలో తెలిపారు. వైద్య సిబ్బంది నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి కంటి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.
Similar News
News April 5, 2025
RGM: కానిస్టేబుల్ నుంచి పంచాయతీరాజ్ AE

రామగుండం NTPCపోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తూర్పాటి సాయిలత పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో AEగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తున్న సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో SIలు ఉదయ్ కిరణ్, మానస పోలీసు సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. గతేడాది కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిలత అనతి కాలంలో AEగా ఉద్యోగ సాధించడం పట్ల అభినందించారు.
News April 5, 2025
కొమరోలు: భర్తపై యాసిడ్ పోసిన భార్య

గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు (మం) బాదినేనిపల్లెకి చెందిన ప్రసన్న, నాగార్జున ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ రాజంపేటలోని బోయినపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా మార్చి 23వ తేదీన నాగార్జునకు ప్రసన్న మత్తు మందు ఇచ్చి అతనిపై యాసిడ్ పోసి పరారైంది. కుటుంబ సభ్యులు నాగార్జునను తిరుపతి, కడప, కర్నూల్ వైద్యశాలలో చికిత్స ఇప్పించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News April 5, 2025
కర్నూలు జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇవే.!

కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కోడుమూరులో అధికంగా 46.4 MM, సి.బెళగల్ 37.8, గోనెగండ్ల 24.2, కర్నూలు(A)23.6, చిప్పగిరి 22.8, కల్లూరు 21.0. కర్నూలు(R)19.8, కృష్ణగిరి 18.2, మంత్రాలయం 14.2, గూడూరు 13.0, హాలహర్వి 11.8, వెల్దుర్తి 11.4, ఎమ్మిగనూరు 10.4, ఆదోని 9.2, కోసిగి 8.8, పెద్దకడబూరు 7.4. నందవరం 7.2, దేవనకొండ 6.8, తుగ్గలి 3.4, ఆస్పరి 3.0, మద్దికెరలో 1.4MMగా పడింది.