News January 29, 2025
SRD: ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు

సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆర్ఎం ప్రభులత మాట్లాడుతూ.. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలన్నారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న సయ్యద్‌కు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరుణ, అన్ని డీపోల డీఎంలు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
GHMC వ్యాప్తంగా అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం

గ్రేటర్ HYD వ్యాప్తంగా GHMC ఆధ్వర్యంలో అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం ఆవిష్కరించింది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, ట్యాబ్, ఎలక్ట్రానిక్ ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలను అధికారులకు అందించినప్పుడు వాటిని గతంలో నమోదు చేయకపోవడంతో గందరగోళం ఏర్పడేది. ఇప్పుడు వాటన్నింటి వివరాలు నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సిస్టం ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రతి దానికి సంబంధించి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టారు.
News November 12, 2025
వంటింటి చిట్కాలు

* బెండ, దొండ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.
* కుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేసి వంటకాల్లో వేస్తే చక్కటి రంగు, రుచి వస్తాయి.
* గ్రేవీలో వేయడానికి క్రీమ్ అందుబాటులో లేకపోతే చెంచా చొప్పున మజ్జిగ, పాలు తీసుకొని కలిపితే సరిపోతుంది.
* బెల్లం, చింతపండు వంటివి త్వరగా నలుపెక్కకూడదంటే ఫ్రిజ్‌లో ఉంచండి.
<<-se>>#VantintiChitkalu<<>>
News November 12, 2025
కర్నూలులో గవర్నర్‌కు ఆత్మీయ స్వాగతం

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు కర్నూలు విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో విచ్చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు.


