News October 24, 2025

SRD: ఉపకార వేతనాలకు దరఖాస్తు ఆహ్వానం

image

ఉపకార వేతనాలకు దివ్యాంగలు విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా సంక్షే మాధికారి లలితకుమారి శుక్రవారం తెలిపారు. 9,10 తరగతుల విద్యార్థులకు ప్రీమెట్రిక్‌, ఇంటర్‌, ఆపై చదువుతున్న వారికి పోస్ట్ మెట్రిక్‌ ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. దరఖాస్తుల కోసం Https://scholarships.gov.in వెబ్‌సై‌ట్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News October 25, 2025

సంగారెడ్డి: రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం

image

జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో రేపు(శనివారం) ఉదయం 8 గంటలకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తం దానం చేయాలనుకునే వారు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.

News October 25, 2025

రాజేంద్రనగర్: అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఉప కులపతి అల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రభుత్వం PJTAUకి 3 నూతన వ్యవసాయ కళాశాలలని మంజూరు చేసిందని హుజూర్‌నగర్ కళాశాలలో 30 సీట్లు, కొడంగల్‌లో రానున్న కళాశాలలో 30 సీట్లు, నిజామాబాద్ కళాశాలలో 30 సీట్లు అందుబాటులోకి రానున్నాయని జానయ్య వివరించారు.

News October 25, 2025

పటాన్‌చెరు: బీరంగూడ శంభుని కుంట చెరువులో మృతదేహం

image

బీరంగూడ శంభుని కుంట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని మంజీరా నగర్ కాలనీ చెందిన తన్నీరు శ్రీను(49) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతడి కొడుకు వాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.