News March 5, 2025
SRD: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేషన్

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.
Similar News
News April 14, 2026
భద్రాద్రి ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

కొత్తగూడెం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.
News April 14, 2026
మూసీ ప్రక్షాళనకు అడుగులు.. DPR కోసం టెండర్ల ఆహ్వానం

మూసీ నదికి పునర్జీవం పోసేందుకు కసరత్తు మొదలైంది. బాపూఘాట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు 34 కిలోమీటర్ల మేర నాలా సీవర్ మళ్లించి, శుద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం DPR తయారీకి MRDCL టెండర్లను ఆహ్వానించింది. గతంలో HMWSSB రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను లోతుగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు లేదా పునరావృత అంశాలు ఉన్నాయో? లేదో? కన్సల్టెంట్ సంస్థ గుర్తించాల్సి ఉంటుంది.
News April 14, 2026
కోర్టుల్లో బెంచ్‌ల గురించి తెలుసా?

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్‌స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్‌లు ఉంటాయి. డివిజన్ బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్‌స్టిట్యూషన్ బెంచ్‌లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్‌లు ఉంటాయి.


