News August 20, 2025

SRD: ఐఐటీ హైదారాబాద్‌లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఆహ్వానం

image

కందిలోని ఐఐటీ హైదారాబాద్‌లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో ప్రత్యేక రౌండ్ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి స్పాన్సర్ చేసిన ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూరుతాయన్నారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు cse.iith.ac.in/admissions/phd లింకులో చూడాలని కోరారు.
-SHARE IT

Similar News

News August 20, 2025

ICC ర్యాంకింగ్స్‌లోకి తిరిగొచ్చిన రోహిత్, కోహ్లీ!

image

టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటర్ల <<17464301>>ర్యాంకింగ్<<>> లిస్టులోకి తిరిగొచ్చారు. ఇవాళ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో వారి పేర్లు మిస్ అయ్యాయి. దీంతో అటు క్రీడా వర్గాల్లో, ఇటు అభిమానుల్లో ఏం జరిగి ఉంటుందన్న చర్చ మొదలైంది. తాజాగా ICC టెక్నికల్ గ్లిచ్‌ను సరిచేయడంతో రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. కాగా ఈ లిస్టులో గిల్ 1, శ్రేయస్ 8వ ర్యాంకులో ఉన్నారు.

News August 20, 2025

పురానాపూల్: పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

పురానాపూల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్థానిక పాఠశాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఈరోజు సందర్శించారు. డిజిటల్ క్లాసులతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటూనే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు.అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు నియంత్రించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News August 20, 2025

సిరిసిల్ల: ’22న ఉపాధి హామీ పథకం పనుల జాతర’

image

జిల్లాలోని 260 గ్రామాల్లో ఈనెల 22న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనుల జాతర నిర్వహించనున్నట్టు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా క్రింద పశువుల కొట్టం, కోళ్ల షెడ్, గొర్రెల షెడ్, పండ్లతోటలు, వాన పాముల ఎరువుల తయారీ, అజోలాఫిట్ నిర్మాణం వంటి పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతాయని వివరించారు.