News April 2, 2025
SRD: ఒక్కో పీఎంశ్రీ పాఠశాలకు రూ. 50 వేలు: DEO

పీఎంశ్రీ పాఠశాలల వార్షికోత్సవం కోసం రూ.50 వేల చొప్పున నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. జిల్లాలోని 44 పాఠశాలలకు రూ. 22 లక్షల నిధులను కేటాయించినట్లు చెప్పారు. నిధులు నేరుగా ఆయా పాఠశాల ఖాతాలో జమ అవుతాయని పేర్కొన్నారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News November 11, 2025
ALERT: ఈ నెల 13న “నెట్ బాల్” ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 విభాలల్లో బాల,బాలికలకు నెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. MBNRలోని DSA ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13న ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9:00 గంటలలోపు పీడీ జ్యోతికి రిపోర్ట్ చేయాలన్నారు.
News November 11, 2025
యాక్టివేటెడ్ చార్కోల్తో ఎన్నో లాభాలు

ప్రస్తుత కాలంలో ఫేస్ క్రీం, ఫేస్ వాష్ ఎందులో చూసినా యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటోంది. దీంతో చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. * ఇది ఓపెన్ పోర్స్ను అన్క్లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది. * మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.
News November 11, 2025
HYD: దొరికిన రూ.1.5 లక్షలు తిరిగిచ్చాడు!

సాధారణంగా ఏదైనా వస్తువు దొరికితే, దానిని తీసుకెళ్లే నేటి రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ మహానుభావుడు గరీబ్రాత్ ఎక్స్ప్రెస్ రైలులో తనకు దొరికిన రూ.1.5 లక్షల నగదును పోలీసులకు అప్పగించాడు. తన మంచితనం, నిజాయితీని చూసి పోలీసులు తనను అభినందించారు. ఈ విషయం తెలిసిన పలువురు ‘ఎంతమంచి వాడవయ్యా’ అంటూ పోస్టులు చేస్తున్నారు.


