News March 1, 2025
SRD: కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్

ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం సంగారెడ్డి పట్టణంలో నెలవంక ఆకాశంలో దర్శనమిచ్చింది. ముస్లింలకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. పండగ సందర్భంగా దానధర్మాలు చేస్తారు. ఇప్పటికే జిల్లాకు చెందిన వారు పండుగ పనులు ప్రారంభించారు.
Similar News
News February 22, 2026
సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News February 22, 2026
స్వర్ణోత్సవాలకు కేయూ సిద్ధం..!

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్‌లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది. UG, PG, Ph.Dతో పాటు SDLCE ద్వారా దూరవిద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 473కు పైగా అనుబంధ కళాశాలున్నాయి.
News February 22, 2026
KNR: మెదడు వాపు.. అప్రమత్తతే శ్రీరామ రక్ష..!

మెదడు వాపు వ్యాధి ప్రాణాంతకమైనదే కాకుండా నయం అయిన తర్వాత కూడా మనిషిని శారీరక, మానసిక వైకల్యానికి గురిచేసే ప్రమాదకర వ్యాధి. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వాపు నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.


