News March 9, 2025
SRD: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఝరాసంఘంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ బేబీ సింగ్ తెలిపారు. 1వ తరగతిలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, ఈనెల 21 వరకు https://kvsangathan.nic.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
కూతురు గొప్పా? కోడలు గొప్పా?

మన ధర్మం ప్రకారం కోడలే ఇంటికి గృహలక్ష్మి. పుట్టినింటిని వదిలి, మెట్టినింటి గౌరవం కోసం పేరును, జీవితాన్ని అంకితం చేసే త్యాగశీలి ఆమె. భర్తను ప్రేమగా చూసుకుంటూ అందరికీ అమ్మలా అన్నం పెట్టే గుణశీలి. పితృదేవతలు మెచ్చేలా వంశాన్ని ఉద్ధరించే శక్తి కోడలికే ఉంది. ఏ ఇంట కోడలిని గౌరవించి, లక్ష్మిగా భావిస్తారో ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఈ ఇంటి కూతురు మెట్టినింటి కోడలిగా వారి అభ్యున్నతికి కారణమవుతుంది.
News December 22, 2025
జగిత్యాల జిల్లాలో 12 నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదన

జగిత్యాల జిల్లాలో మొత్తం 51 Pacsలు ఉండగా, 1.5 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అయితే జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లాలోని మోరపల్లి, పోరండ్ల, లక్ష్మీపూర్, మద్దులపల్లి, రాపల్లి, వర్తకొండ, జగ్గసాగర్, కొత్త దాంరాజ్పల్లి, బుగ్గారం, మన్నెగూడెం, అంబారిపేట, కట్కాపూర్‌లో ట్రైబల్ సొసైటీ ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు.
News December 22, 2025
నిద్ర పట్టట్లేదా? మీ సమస్య ఇదే కావొచ్చు!

నిద్రలేమి సమస్యలకు కెఫిన్ కారణం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 10-20% దీర్ఘకాలిక నిద్ర సమస్యలొస్తున్నట్లు చెబుతున్నారు. ‘కెఫిన్‌ను జీర్ణం చేసుకునే సామర్థ్యం లేకపోతే నిద్రపట్టదు. అలాంటివారు పడుకోడానికి 6-8 గంటల ముందే కాఫీ, టీ, చాక్లెట్ వంటివి తీసుకోవద్దు. అయినా తగ్గకపోతే పూర్తిగా కెఫిన్ తీసుకోవడం మానేయాలి. కొన్నిరోజుల్లో మార్పు కనిపిస్తుంది’ అని తెలిపారు.
SHARE IT


