News November 6, 2025

SRD: జాతీయ సాహస శిబిరానికి ‘తార’ విద్యార్థిని

image

కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచు కొండల ప్రాంతంలో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీవిద్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ గురువారం తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా, శ్రీవిద్య అందులో ఒకరు. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు మనాలిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.

Similar News

News November 6, 2025

మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

image

బోరాన్‌ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్‌ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News November 6, 2025

వర్గల్: ‘మందుల కొరత లేకుండా చూడండి’

image

వర్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. పెద్ద ఆసుపత్రి కావున ఓపీ పెంచాలని, మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. పాత ఆసుపత్రి నుంచి పర్నిచర్ షిప్ట్ చేయించాలని, మెడిసిన్ కొరత లేకుండా సప్లై చేయాలని DMHOను ఫోన్లో ఆదేశించారు.

News November 6, 2025

SV యూనివర్సిటీ ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు

image

సైకాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ ఎస్. విశ్వనాథ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులను ర్యాగింగ్ చేయించినట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారణకు రావడంతో వేటుపడింది. ర్యాగింగ్‌పై విద్యార్థుల ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎస్వీయూ ఏర్పాటు చేసింది. ఇంటరాక్షన్ సెషన్‌లో పేరుతో HOD ర్యాగింగ్ చేయించారని MSc సైకాలజీ విద్యార్థులు(ఫస్ట్ ఇయర్) SPకి PGRSలో ఫిర్యాదు చేశారు.