News March 24, 2025

SRD: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

image

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు డీఈవో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్‌ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.

Similar News

News March 25, 2025

శ్రేయస్ ఖాతాలో అరుదైన ఘనత

image

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించారు. టీ20ల్లో 6వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా నిలిచారు. దీంతో ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కారు. మరోవైపు IPLలో 2వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో కెప్టెన్‌గా ఉన్నారు.

News March 25, 2025

విశాఖలో 50% వడ్డీ పై రాయితీ: కలెక్టర్

image

జీవీఎంసీ పరిధిలో గృహ యజమానులు, ఆస్తిపన్ను చెల్లింపుదారులు మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 50శాతం వడ్డీ పై రాయితీ మినహాయింపును పొందవచ్చని కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగర ప్రజలు సౌకర్యార్థం, ప్రతీ వార్డు సచివాలయంలో ఆస్తిపన్ను బకాయిలను చెల్లించవచ్చు అన్నారు. మార్చి 30 ఆదివారం కూడా జోనల్ కార్యాలయాల్లో కేంద్రాలు పనిచేస్తాయన్నారు.

News March 25, 2025

టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. 9 మందిపై కేసు

image

AP: కడప(D) వల్లూరులో నిన్న మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లీకైన ఘటనలో పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా 9 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో షంషుద్దీన్ వెల్లడించారు. వాటర్ బాయ్‌‌ సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్‌కి వాట్సాప్ చేసినట్లు ఆయన వివరించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!