News April 7, 2025
SRD: పది మూల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో రేపటి నిర్వహించే పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. 1222 మంది ఉపాధ్యాయులను నియమించామని, మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News April 9, 2025
పత్తి కొనుగోళ్లలో అగ్రస్థానంలో తెలంగాణ

TG: దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జౌళి శాఖ ప్రకటించింది. ‘ఈ ఏడాది మార్చి 31లోపు జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్లను సేకరించింది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(30 లక్షలు), గుజరాత్(14 లక్షలు) ఉన్నాయి’ అని వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇక ఆంధ్రప్రదేశ్ 4లక్షల బేళ్ల పత్తిని సేకరించింది.
News April 9, 2025
నెక్కొండలో లక్క పురుగుల నుంచి కాపాడండి!

నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల లక్క పురుగుల ద్వారా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లక్క పురుగుల నుంచి తమకు కాపాడాలని కోరుతున్నారు. సంబంధిత గోధుమలను తనిఖీ చేసి నివారణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని తెలుపుతున్నారు.
News April 9, 2025
చేతబడి చేస్తున్నాడని అనుమానంతో హత్య..!

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలో జెడ్ వీరభద్రం గ్రామానికి చెందిన కొమరం రాముడు మృతదేహం మంగళవారం ఆ గ్రామ చెరువులో లభ్యమయింది. చేతబడి చేస్తున్నాడని గుర్తు తెలియని వ్యక్తులు రాముడిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.