News March 5, 2025
SRD: పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

జిల్లాలో ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే 54 కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ రూపేష్ మంగళవారం తెలిపారు. 100 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు పరీక్షలు జరిగే సమయంలో మూసి ఉంచాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 15, 2025
హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవు: ప్రధాని అల్బనీస్

బాండీ బీచ్ వద్ద <<18561798>>ఉగ్రదాడి<<>> బాధితులకు అండగా ఉంటామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవని, దీటుగా ఎదుర్కొంటామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీఎం మృతులకు నివాళి అర్పించారు. ఉగ్రదాడి నేపథ్యంలో బాండీ బీచ్ వైపు వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. ఈ దాడిలో మరణాల సంఖ్య 16కు చేరగా 42 మంది గాయపడ్డారు.
News December 15, 2025
గోదాదేవి రచించిన పాశురాల గురించి తెలుసా?

దైవారాధనకు కఠిన దీక్షలు అవసరం లేదని, స్వచ్ఛమైన ప్రేమతో కూడా దేవుడిని వశం చేసుకోవచ్చని గోదాదేవి నిరూపించింది. ఆమె అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి కృష్ణుడిని భర్తగా పొందింది. తాను ధరించిన పూల మాలను కృష్ణుడికి సమర్పించింది. ఆమె రచించిన 30 పాశురాలనే ‘తిరుప్పావై’ అంటారు. పెళ్లికాని యువతులు రోజుకొకటి చొప్పున 30 పాశురాలు ఆలపిస్తే సద్గుణాల భర్త వస్తాడట. రేపటి నుంచి భక్తి కేటగిరీలో పాశురాలను చూడొచ్చు.
News December 15, 2025
కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.


