News April 24, 2025
SRD: ‘పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి’

విద్యారంగా సమస్యలపైన బుధవారం విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి తప్పనిసరి అని, పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహ రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 24, 2025
ఉమ్మడి కడప: ఒకేసారి తండ్రి, కూతురు పాస్

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన 2025 పది పరీక్షా ఫలితాల్లో తండ్రి, కూతురు ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 268 మార్కులు తెచ్చుకున్నారు. ఈయన 9వ తరగతి వరకు చదివి డ్రాప్ అయ్యారు. ఈ ఏడాది ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి పాస్ అయ్యారు. ఆయన కుమార్తె మోడెం పూజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించింది.
News April 24, 2025
గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్‌కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
News April 24, 2025
మామడ: టీచర్ వెళ్లొద్దని కంట నీరు పెట్టిన విద్యార్థులు

మామడ మండలంలోని చెరువుముందు తండా ప్రాథమిక పాఠశాలలో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు సుప్రియ అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆమె పాఠశాల నుంచి రిలీవ్ కాగా పోషకుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు బోధించిన టీచర్ బదిలీపై వెళ్లడాన్ని తట్టుకోలేక విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే పాఠశాలలో ఉండి తమకు బోధించాలని వేడుకున్నారు.