News September 6, 2025
SRD: పిల్లలను చంపేదుకు చేతులెలా వచ్చాయి తల్లీ !

సంగారెడ్డి(D) నిజాంపేటలో <<17625700>>ఇద్దరు పిల్లలను చంపి తల్లి<<>> ఉరేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దామరచెరువుకు చెందిన సంగమేశ్వర్‌తో ప్రేమలకు మూడున్నరేళ్ల క్రితం పెళ్లైంది. రెండు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె నిన్న ఈ దారుణానికి పాల్పడింది. ‘భరించలేని కష్టమొచ్చిన సరేనమ్మా.. పిల్లలను చంపేదుకు చేతులెలా వచ్చాయి తల్లీ’ అని బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యాంతమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 6, 2025
ఈనెల 8న ఎచ్చెర్ల ఐటీఐ కాలేజీలో అప్రెంటీస్ మేళా

ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల 8న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌ఛార్జి సాయిబాబు శనివారం తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ 11 కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు గుర్తింపు కార్డు, 4 రెస్యూమ్ కాపీలు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.
News September 6, 2025
బీర్కూర్: రేపు ఆలయ ద్వారాలు మూసివేత

బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం ఉదయం 11:00 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 6:00కి సుప్రభాత సేవతో తెరిచి ఆలయ సంప్రోక్షణ అనంతరం 8:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
News September 6, 2025
జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.