News February 13, 2025
SRD: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
Similar News
News September 17, 2025
MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.
News September 17, 2025
బాపట్లలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్

ఆరోగ్యకరమైన మహిళలు – బలమైన కుటుంబం లక్ష్యంతో చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం బాపట్లలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరిక్షలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.
News September 17, 2025
రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.