News March 13, 2025

SRD: బ్యాంకింగ్‌లో ఉచిత శిక్షణ

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు బ్యాంకింగ్ కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి.ప్రవీణ్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగి 26 ఏళ్ల లోపు గల బీసీ అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8 వరకు www.tgbcstudycircle.cgg.gov.inలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.

Similar News

News March 13, 2025

తునిలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానం

image

తునిలో గల మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలురు పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ యజ్ఞ విశ్వశాంతి బుధవారం తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతి వరకు అర్హులైన విద్యార్థులంతా ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్‌తో పాటు నేరుగా పాఠశాల వద్దకు వచ్చి దరఖాస్తులు అందజేయొచ్చని చెప్పారు. 

News March 13, 2025

వెంకటాపూర్: Way2Newsకు స్పందన

image

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న Way2Newsలో ప్రచురితమైన కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.

News March 13, 2025

పాతపట్నం: వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే మృతి

image

పాతపట్నం నుంచి టెక్కలి వెళ్లే రహదారి మార్గంలోని ద్వారకాపురం గ్రామం వద్ద బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాతపట్నం మండలం, లాబర గ్రామానికి చెందిన సనపల మధు(22) మృతి చెందాడు. మృతుడి బావ మండల శివకు గాయాలయ్యాయి. సారవకోట మండలం జమ్మి చక్రం గ్రామానికి చెందిన మరో వ్యక్తి పంతులు గోపి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి ఏప్రిల్ 16 న పెళ్లి నిశ్చయమైంది.

error: Content is protected !!