News March 7, 2025

SRD: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

image

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్‌టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.

Similar News

News March 9, 2025

PMJ జ్యువెల్స్ – అతిపెద్ద వెడ్డింగ్ & హాఫ్‌ శారీ, జ్యువెలరీ ఎగ్జిబిషన్

image

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జువెల్స్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద వెడ్డింగ్ & హాఫ్ శారీ ఎగ్జిబిషన్‌ను తాజ్ కృష్ణలో శుక్రవారం ప్రారంభించింది. ఇందులో సంప్రదాయం, ఆధునికత కలబోతతో కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 20,000+ ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు మేనేజ్మెంట్ తరపున ప్రతీక్ జైన్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్ ఆదివారం ముగియనుందని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 9, 2025

MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

image

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News March 9, 2025

రెండు రోజులు జాగ్రత్త

image

ఏపీలో ఎండలు మండుతున్నాయి. నిన్న రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

error: Content is protected !!