News February 23, 2025
SRD: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో శిక్షణ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
వికారాబాద్: అంగన్వాడీ పోస్టుల వివరాలు

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పలు జిల్లాలో ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ నేతృత్వంలో నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ చేయనున్నారు. జిల్లాలో 49 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 238 మంది ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
News February 23, 2025
భువనగిరి: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

భువనగిరి జిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్ కావాలనే పరిస్థితి నుంచి కోడిమాంసం తెచ్చుకోవాలంటే జంకే స్థితికి ప్రజలు వచ్చారు. బాయిలర్ కోళ్లతోపాటు ఫారం కోళ్లు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. కాగా చౌటుప్పల్ మండల పరిధిలోని నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News February 23, 2025
బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.