News August 18, 2025
SRD: మహిళ తలపై నుంచి వెళ్లిన బస్సు టైర్

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని మహిళ మృతి చెందింది. పోలీసులు వివరాలు.. నిజాంపేట్(M) బాచుపల్లికి చెందిన సంతోషి(48) అతని కొడుకు పరమేష్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా లక్డారం వద్ద ఈ ఘటన జరిగింది. పటాన్‌చెరు నుంచి పిట్లం వెళ్తున్న RTC బస్సు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో సంతోషి బస్సు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పరమేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News August 18, 2025
ఎండాడ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

సముద్రంలో ఎండాడకు చెందిన జాలరి పిల్లా సతీష్ (24) గల్లంతయ్యాడు. అలల ఉద్ధృతికి తీరంలో ఆరబెట్టిన వలలు కొట్టుకుపోతుండగా.. వాటి కోసం వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయాడు. మధ్యాహ్నం వరకూ చూసిన తండ్రి వీర్రాజు తమ వారితో తీరంలో వెతికినా జాడ లేకపోవడంతో ఎంవీపీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు.
News August 18, 2025
భద్రాద్రి యువతకు ఉద్యోగ మేళా

భద్రాద్రి ఏజెన్సీ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్ ఈరోజు తెలిపారు. హైదరాబాద్‌లోని బయోకాన్ కంపెనీలో అప్రెంటిస్‌గా పనిచేయడానికి B.Sc కెమిస్ట్రీ, M.Sc కెమిస్ట్రీ/డిప్లొమా కెమికల్/B.Tech కెమికల్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
News August 18, 2025
బందీల విడుదలకు అంగీకరించిన హమాస్!

ఇజ్రాయెల్‌తో 60 రోజుల సీజ్‌ఫైర్‌కు పాలస్తీనా టెర్రర్ గ్రూప్ హమాస్ అంగీకరించిందని Reuters తెలిపింది. ఈ మేరకు మిగిలిన బందీలను విడుదల చేయనుందని పేర్కొంది. అదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ క్రమంగా తమ బలగాలను వెనక్కి తీసుకోనుందని చెప్పింది. అయితే బందీలందరినీ వదిలేసి ఆయుధాలను పక్కనపెడితేనే యుద్ధం ఆపుతామని గతంలో ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సీజ్‌ఫైర్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుందో చూడాలి.