News April 11, 2025

SRD: రేపే స్క్రీనింగ్ టెస్ట్.. వెబ్ సైట్‌లో హాల్ టికెట్లు

image

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఇవ్వనున్న బ్యాంకింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ టీ.ప్రవీణ్ తెలిపారు. ఈనెల12 శనివారం రోజు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు.

Similar News

News September 16, 2025

ఏలూరు: కాలువలో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

image

ఏలూరు కొత్తూరు జూట్ మిల్లు వద్ద కాలువలో లభ్యమైన మృతదేహాన్ని గ్రీన్ సిటీకి చెందిన కోట ప్రసాద్ (48)గా పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడంతో పడమర లాకుల్లో పడి కొట్టుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2025

MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

image

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్‌లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

News September 16, 2025

KNR: శాతవాహన డిగ్రీ ఇన్స్టంట్ ఎగ్జామ్ రేపే

image

డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థుల కోసం ఇన్స్టంట్ పరీక్ష SEP 17న (రేపు) ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. 5వ సెమిస్టర్ ఎగ్జామ్ ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాలలో జరుగుతాయని, 6వ సెమిస్టర్ ఎగ్జామ్ మ.2 గం.ల నుంచి సా.5 గం.ల వరకు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జరుగుతాయని చెప్పారు.